లడఖ్‌లో అంతర్వాతీయ ప్రపంచశాంతి సదస్సు..

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జమ్ము కాశ్మీర్‌ లడఖ్‌లో అంతర్జాతీయ ప్రపంచశాంతి సదస్సు జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివద్ధి సంస్థ చైర్మెన్‌ గెల్లు శ్రీనివాసయాదవ్‌, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం విశేషాలను, తెలంగాణాలోని బౌద్ధ ప్రదేశాల విశేషాలను వివరించారు. సదస్సులో మహాబోధి ఇంటర్నేషనల్‌ మెడిటేషన్‌ సంస్థ వ్యవస్థాపకులు సంఘసేన మహథేరో, మహాకాశ్యప్‌ మహాథేరో, ప్రెసిడెంట్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాన్‌ యూనివర్సిటీ డాక్టర్‌ ప్రియరంజన్‌ త్రివేది, బుద్ధవనం నుంచి కె.సదారెడ్డి, ఒఎస్‌డీ డీ.ఆర్‌.శ్యాంసుందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.