
శంకరపట్నం మండల పరిధిలోని మొలంగూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆయుర్వేద వైద్యులు సంధ్య ఆధ్వర్యంలో ఘనంగానిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యా మాట్లాడుతూ.. యోగా విశిష్టత ,ప్రాధాన్యత ను పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వివరించారు. నేటి ఈ అవిశ్రాంత జీవన శైలి లో పలు యోగ ఆసనములు విద్యార్థిని విద్యార్థులతో చేయించారు. అదేవిధంగా శారీరక ,మానసిక సమస్యలతో అన్ని వయసుల వారు ఇబ్బంది పడుతున్నారని తమ లైఫ్ స్టైల్ లో తగు మార్పులు,చేర్పులు చేసుకుంటూ యోగా చేయడం అలవాటుగా చేసుకుంటే చక్కటి ఆరోగ్యం ఉంటుందని ఆమె వివరించారు. అనంతరం ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీరజ, స్కూల్ టీచర్లు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.