శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ లో అంతర్జాతీయ యోగ దినోత్సవం..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి కేంద్రం పరిధిలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్లో శుక్రవారం  అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తోటకూరి యాదయ్య విద్యార్థులకు యోగ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి రోజూ యోగ సాధన చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం అలవడుతుందన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నవారు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు అన్నారు. ప్రతి రోజూ యోగ  చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందనీ, దానివల్ల ఆయుస్సు పెరుగుతుందనీ కావున అందరూ ప్రతిరోజూ యోగా చేయాలన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ హైస్కూల్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.