ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – మల్హర్ రావు
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలకేంద్రమైన తాడిచెర్లలోని గిరిజన సంక్షేమ వసతి గృహం ఆవరణలో శుక్రవారం పలువురు యోగా దివాస్ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా మాస్టర్ కోటగిరి శివ కుమార్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించి మెళకువలు నేర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మల్కా మోహన్ రావు, బీజేపీ మండల అధ్యక్షులు ముడితనపెల్లి ప్రభాకర్ లు మాట్లాడారు. యోగాతో శారీరక మానసిక ఉల్లాసం, శరీర దృఢత్వం ఏర్పడుతుందని యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ విధిగా యోగాను అలవాటూ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కుక్కడపు అశోక్, చొప్పరి రాజు, నూతి నరేష్, జొన్నల శేరాలు, కోట నవీన్, మల్క కార్తీక్ రావు, నక్క శ్రీకాంత్, గాదనవేన రాజయ్య తదితరులు పాల్గొన్నారు.