నవతెలంగాణ – ధర్మారం
మండల కేంద్రంలో పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పతంజలి యోగా గురూజీ సుధాకర్ – మంజుల గురు దంపతుల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ నుండ బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు యోగా తో ఆరోగ్యం వస్తుందని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చౌరస్తాలో వృక్షాసనం తదితర ఆసనాలు వేసి చివరగా కొ గురువుగారు గురుమాత తో కలిసి కొన్ని సూర్య నమస్కారాలు, యోగ ఆసనాలు వేసి యోగ ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుందని యోగ ప్రాముఖ్యతను గురు దంపతులు వివరించారు అనంతరం వ్యాసకులందరికీ పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగా గురుజీ జంగిలి సుధాకర్ – మంజుల గురుమాత దంపతులు పతంజలియోగ సభ్యులు సాయి, కుంట మహేశ్వరి, స్వర్ణలత, కవిత, రాజమణి, శ్రీవిద్య, కళ్యాణి, సాయి ప్రణవి, పోశెట్టి ఉప్పులంచ దయానంద్, దేవి అంజన్న, ఉమాశంకర్, వేణుగోపాలరావు, ఈగం ప్రసాద్, ముత్త రమేష్ నాడెం శ్రీనివాస్ చిప్ప రవి, లాయర్, మారుతి, సురేష్ తదితరులు మరియు యోగా అభ్యాసకులు అధిక సంఖ్యలో పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేశారు అనంతరం యోగ అభ్యాసకులు గురు దంపతులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.