
శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో శుక్రవారం వేములవాడ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం మొదలైన యోగ ప్రక్రియలను సాధన చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొమురవెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా ను మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని, వ్యక్తి మానసిక,శారీరక సంపూర్ణ ఆరోగ్యం కి యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రతిరోజు యోగ సాధన చేయాలని తెలుపుతూ,2014కంటే ముందు యోగా గురించి ప్రపంచం లో ఎక్కువ గా తెలియదని, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తరువాత వారి ద్వారా ప్రపంచ దేశాల కు యోగా పరిచయం అయిందని వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి లో ప్రధాని మోడీ యోగా విశిష్టత గురించి వివరించగా, యోగా ఆవశ్యకత ని గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రకటించిందని , ఈరోజు 190దేశాల్లో యోగా దినోత్సవం జరుగుతుందని, ఇది భారతీయులుగా మనందరికీ గర్వకారణమని తెలిపారు. శిశు మందిర్ లో చదువుకోవడం మీకు ఒక గొప్ప వరం అని ఎందుకంటే ఇక్కడ మీరు నేర్చుకున్న విలువలు, ఆచారాలు, సంస్కృతుల విలువ మీకు భవిష్యత్తులో అర్థం అవుతుందని, క్రమశిక్షణతో విద్యనభ్యసించి మీ అమ్మ నాన్న లకు పాఠశాల కి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో మంచాల కైలాసం , కార్యదర్శులు గర్శకుర్తి వెంకటేశ్వర్లు, మోటూరి మధు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.