పోస్టఫీసు సేవలపై డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్ షిప్

Internship for Degree Students on Post Office Services– విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేత
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పోస్టఫీసు సేవలపై డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ ద్వారా అవగాహన కల్పించడంతో పాటు సర్టిఫికేట్లను అందిస్తున్నామని ఉమ్మడి జిల్లా తపాల పర్యవేక్షకుడు దేవిరెడ్డి సిద్దార్థ అన్నారు. 45 రోజుల ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్నఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ముగ్గురు విద్యార్థులకు నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ కలిసి గురువారం ధ్రువపత్రాలను అందజేశారు. అదనపు కలెక్టర్ ఇంటర్న్షిప్ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐపీపీబీ తరపున డిజిటల్ లావాదేవిలను సులభతరం చేసేల వ్యాపారస్తుల కోసం డాక్ సేవా క్యూఆర్ కోడ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా తపాల పర్యవేక్షకుడు దేవిరెడ్డి సిద్దార్థ మాట్లాడుతూ… తపాల శాఖ తరపున డిగ్రీ ఫైనల్ ఈయర్ విద్యార్థులకు 45 రోజుల పాటు తపాలా సేవలపై అవగాహన కల్పించేల ఇంటర్న్షిప్ ఇస్తున్నామన్నారు. డిగ్రీ కళాశాల నుంచి ముగ్గురు విద్యార్థునులు శివాణీ, శరణ్య, ప్రవలికలు 45 రోజుల పాటు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఇక్కడి సేవల గురించి తెలుసుకున్నారని తెలిపారు. అదే విధంగా డిజిటల్ లావాదేవిల్లో పోస్టాఫీసు కూడా అడుగుపెట్టిందన్నారు. వ్యాపారుల కోసం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. పాస్టాఫీసుకు ఎక్కువ మంది వినియోగదారులు గ్రామీణప్రాంతాల నుంచే ఉన్నారని, వారికి ఎంతో సులభతరం అవుతున్నారన్నారు. ఈకార్యక్రమంలో ఐపీపీబీ మేనేజర్ రాజేష్ కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అతిక్ బేగం, అధ్యాపకులు చంద్రకాంత్, పోస్టాఫీసు సిబ్బంది పాల్గొన్నారు.