విద్యుత్ సరఫరాలో అంతరాయం

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్ మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సుహాసిని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవీపేట్ సబ్ స్టేషన్ 33 కెవి పరిధిలోని అభంగ పట్నం, అబ్బాపూర్, నవీపేట్, దర్యాప్తుర్ తాండ,స్టేషన్ ఏరియా, పొతంగల్, శివతాండ, హనుమాన్ ఫారం, శ్రీరామ తాండ, అలాగే కమలాపూర్ సబ్స్టేషన్ పరిధిలోని మహంతం, రెడ్డి ఫారం, మోకాన్ పల్లి, గ్రామాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వినియోగదారులు గమనించాలని సూచించారు.