రైతు వేదికలో ముఖ్యమంత్రితో ముఖాముఖి

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ అధికారి కే జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం  రుణమాఫీ సందర్భంగా ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవో జితేందర్ రెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలు కలిగిన వారి జాబితాను విడుదల చేయడం జరిగిందన్నారు. రైతులు సంబంధిత బ్యాంకులో సంప్రదించి రుణమాఫీ పొందవచ్చని అన్నారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో రావడం హర్శించదగ్గ విషయమని అన్నారు. రుణమాఫీ సంబరాలను శుక్రవారం మండల వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు మరియు మండల రైతాంగం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ముఖాముఖి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నంత సేపు ఎంతో సంతోషంగా ఉందని మాట్లాడుతున్న రైతులు కూడా మనస్ఫూర్తిగా హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని రైతులు అన్నారు.