కారుణ్య నియామకం కోసం ఇంటర్వ్యూలు

కారుణ్య నియామకం కోసం ఇంటర్వ్యూలునవతెలంగాణ-రెబ్బెన
సింగరేణి ఉద్యోగం చేస్తూ మృతి చెందిన, మెడికల్‌ ఇన్‌వ్యాలిడేట్‌ అయిన ఉద్యోగుల వారసులకు గోలేటిలోని జీఎం కార్యాలయ కాన్ఫరెన్సు హాల్‌లో శనివారం ఖైరిగూడ పీఓ ఎన్‌.సత్యనారాయణ ఇంటర్వ్యూలు నిర్వహించారు. 8 మంది కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు, కుటుంబ సభ్యుల ఖైరిగూడ పీఓ ఎన్‌.సత్యనారాయణ, పర్సనల్‌ మేనేజర్‌ రెడ్డిమల్ల తిరుపతి వివరాలపై ఆరా తీశారు. ఉద్యోగ వివరాలపై ప్రశ్నించి, ధ్రువ పత్రాలను పరిశీలించారు. సింగరేణి సంస్థ ద్వారా అందే బెనిఫిట్స్‌ గురించి అవగాహన కల్పించారు. సింగరేణి సంస్థ కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా సింగరేణి కార్మికులు వారి పిల్లలను ఉన్నతంగా చదివించాలని సూచించారు. చదువు కోసం సంస్థ కూడా సహకారం అందిస్తుందని తెలిపారు. వాటిని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఖైరిగూడ ఓసీ మేనేజర్‌ ప్రవీణ్‌ వి ఫాటింగ్‌, డిప్యూటి పీఎం వేణు, సీనియర్‌ పర్సనల్‌ అధికారి డి ప్రశాంత్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ బాబా పాల్గొన్నారు.