కాలం అనే అద్దంలోకి

కాలం అనే అద్దంలోకితేదీలు మారినంత తేలికగా
తలరాతలు మారవు
అవి ఎక్కడేసిన గొంగడిలా అక్కడే
పడి తగలబడుతుంటాయి
తిష్ట వేసుకున్న సమస్యలన్ని ముళ్ల
కంచెల్లా చుట్టుముడుతుంటాయి
చెవుల్లో జోరిగల్లా జొరబడి రొదపెడుతుంటాయి
గోడ మీదున్న గడియారన్ని చూపిస్తూ
ముల్లులా గుచ్చుకుంటాయి
కాలాన్ని చక్రంలా తిప్పి ఎక్కడినుండో మరెక్కడికో విసిరేస్తుంటాయి
ఆశల వలయంలోకి నెట్టేస్తూ బయటకు రాకుండా భయపెడుతుంటాయి
కళ్ల ముందున్న నిజాన్ని భ్రమింపజేస్తూ
నిజమన్నట్టు నమ్మిస్తాయి
చివరికి మనిషి కాలిబూడిదయ్యేవరకు వదలకుండా వెంటపడి వేదిస్తుంటాయి
అందుకే తలరాతలు మార్చని తేదీలను చూస్తూ కూర్చుంటే బతుకు బాగుపడదు
కాలమనే అద్దంలోకి చూసి వాస్తవంగా బతికితేనే తలరాతలు తిరిగి రాయబడతాయి!!
– ఎస్‌.జవేరియా, 9849931255