మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

charset=InvalidCharsetId

నవతెలంగాణ-వీర్నపల్లి : మత్తు పదార్థాలకు యువకులూ విధ్యార్థులు దూరంగా ఉండాలని ఎస్ఐ జిల్లెల్ల రమేష్ సూచించారు. వీర్నపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతు యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్‌ మహమ్మారి నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత భయంకర వ్యసనమన్నారు. దీనిని తరిమికొట్టాల్సిన బాధ్యత యువత, విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. డ్రగ్స్‌తో విచక్షణ కోల్పోతారని, ఏం చేస్తున్నారో కూడ తెలియదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఎ ఎస్ ఐ రాజిరెడ్డి, కానిస్టేబుల్ ప్రశాంత్, పోలిస్ సిబ్బంది ఉపాధ్యాయులు ఉన్నారు.