
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని హుస్నాబాద్ ప్రొహిబిషన్ , ఎక్సైజ్ సిఐ పవన్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని మోడల్ స్కూల్ , పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు మత్తు పదార్థాలు (నార్కొటిక్ డ్రగ్స్) పై ఆయన అవగాహన కల్పించారు, ఈ సందర్బంగా మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం చెడిపోయి నేరాలకు పాల్పడే అవకాశాలున్నాయని తెలిపారు. గంజాయి డ్రగ్స్ వంటి వాటికి బానిస అయ్యి బంగారు బావిష్యత్తుని నాశనం చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చెరాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండి తల్లి తండ్రులకు కళాశాలకు మంచి పేరు తేవాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎస్సై దామోదర్, సిబ్బంది, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ పాల్గొన్నారు.