నవతెలంగాణ-తిర్యాణి
దేశం వివిధ రంగాలలో రాణించాలంటే దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని ఎస్‌ఐ రమేష్ అన్నారు. గురువారం డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు గేడం టికానంద్‌తో కలిసి మాదకద్రవ్యాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ దేశ అభివృద్ధి యువతపై ఆధారపడి ఉందని, దేశం వివిధ రంగాలలో రాణించాలంటే యువత మేధస్సు, నైపుణ్యం అవసరమన్నారు. నేటి యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో పడిందన్నారు. జ్ఞానాన్ని, విచక్షణను తమ శక్తి సామర్థ్యాలను కోల్పోయి నిర్వీర్యమై నిస్తేజంగా మారుతుందన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలించడంలో యువత, విద్యార్థులు కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు గేడం టికానంద్, మండల అధ్యక్షులు తాళ్లపల్లి రాజేశ్వర్ పాల్గొన్నారు.