
తెలంగాణ ప్రభుత్వం అసంబ్లీ లో ఎస్సీ వర్గీకరణకు తీర్మాణం ప్రవేశ పెట్టడం ఎంతో హర్షనీయమని జాతీయ విగ్రహాల వ్యవస్థాపక అధ్యక్షులు
ఎంఆర్పీఎస్ నాయకులు పులిమాల కృష్ణారావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో జాతీయ నాయకుల విగ్రహాల కూడలిలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 30 ఏళ్ల ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఫలితంగా రెండు రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ లో తీర్మానం పెట్టడం ఎంతో సంతోషం అని అన్నారు.మాజీ మంత్రులు జానా రెడ్డి ఎమ్మార్పీఎస్ నాయకులతో మాట్లాడుకుంటూ ఎస్సీల వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీ అసెంబ్లీలో వర్గీకరణ అమలు చేయడం జరుగుతుందని చెప్పారని అన్నారు.జానా రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఏకసభ్య కమిషన్ చైర్మన్ కు వర్గీకరణ కోసం కృషి చేసిన మంత్రులు, శాసనసభ్యులు, వివిధ వాదాల్లో వర్గీకరణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కుక్క ముడి ముత్యాలు,మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ ఆడెపు రామలింగయ్య, దున్న వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ నాయకులు నాయకులు మెల్లెపల్లి నరేందర్, హరి, శ్రీనివాస్, వెంకన్న, తదితరులు వున్నారు.