
గోవిందరావుపేట మండలాన్ని గురువారం వరదలు ముంచెత్తి అపార నష్టాన్ని కలుగజేసాయి. మండల కేంద్రంలోని దయ్యాల వాగు పసరాలోని గుండ్ల వాగు ఉదృతంగా ప్రవహించడంతో పలు ప్రాంతాలు ముంపుకు గురై నివాసాన్ని కోల్పోయారు. మండల కేంద్రంతో పాటు పసర పాఠశాలలో కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి మండల కేంద్రంలో 500 మందికి పసర కేంద్రంలో 250 మందికి పునరావాస సౌకర్యం కల్పించి మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు తాహసిల్దార్ అల్లం రాజకుమార్ తెలిపారు. చంద్రు తండా నుండి కూడా ఒక ఐదు కుటుంబాలను కర్లపెల్లి పాఠశాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వరదల వల్ల మండలంలోని పసర గ్రామంలో ఇతర ప్రాంతాలలో 256 గోర్లు రాంనగర్ గ్రామంలో ఒక ఎద్దు పసరలో ఒక బర్రె 200 కోళ్లు మృతి చెందడంతో పాటు అభ్యుదయ కాలనీ ప్రాంతంలో 50 మీటర్ల మేర 163 వ జాతీయ రహదారి ధ్వంసం అయిందని, గుండ్ల వాగు వంతెన వద్ద వంతెనకు ఇరువైపులా రహదారి కోతకు గురైందని అన్నారు. మొట్లగూడెం పంచాయతీ ప్రాజెక్టు నగర్ గ్రామంలొ ముగ్గురి ఆచూకీ గల్లంతు కాగా సాయంత్రానికి ఆరు సంవత్సరాల బాలుని మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. పసర నార్లపూర్ రహదారిలో టపా మంచే సమీపంలో రహదారి కోతకు గురైనట్లు ఆ రహదారి ఇంకా వరద నీటిలోనే ఉన్నట్లు తెలిపారు. పునరావస కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ఉదయం టిఫిన్ మధ్యాహ్నము రాత్రి వేళ భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో 250 కుటుంబాలు పసరలో 100 కుటుంబాలు పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితులను గమనిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, డిపిఓ వెంకయ్య, డిఎస్పి రవీందర్ ,ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ,ఎంపీ ఓ సాజిదా బేగం , ఆర్ ఐ లు సుధాకర్ రాజేందర్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.