అంగన్వాడి జీపు జాత పోస్టర్ల ఆవిష్కరణ

నవతెలంగాణ -నవీపేట్: మండల కేంద్రంలో అంగన్వాడి జీపు జాత పోస్టర్లను సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ నాయకురాలు శివ రాజమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులు, టీచర్లు హెల్పర్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, 45వ ఇండియన్ లేబర్ కౌన్సిల్ సిఫారసు మేరకు 26వేల వేతనాన్ని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. బకాయి పడ్డ టి ఏ, డి ఏ లను వెంటనే చెల్లించాలని, సెంటర్ అద్దెలను సకాలంలో ఇవ్వాలని సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19న అంగన్వాడీల జీపు జాత కార్యక్రమం నిజామాబాద్ పాత కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం వద్ద వస్తున్నందున చలో నిజామాబాద్ కార్యక్రమానికి మండలంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీలో ఉమారాణి రమాదేవి మాధవి కళావతి తదితరులు పాల్గొన్నారు.