పిఏసీఎస్ ఏర్గట్ల క్యాలెండర్ ఆవిష్కరణ.

నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రంలో మంగళవారం పిఏసీఎస్ అధ్యక్షులు బర్మ చిన్న నర్సయ్య అధ్యక్షతన సంఘ వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా పిఏసీఎస్ అధ్యక్షులు బర్మ చిన్న నర్సయ్య మాట్లాడుతూ…రైతులకు సకాలంలో ఎరువులను,విత్తనాలను అందించడమే సంఘ ధ్యేయం అని, రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో రుణాలు చెల్లించి సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ వైస్ ఛైర్మన్ సిగసారం గంగారాం, డైరెక్టర్లు బద్దం ప్రభాకర్, కొలిప్యాక శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం పెద్ద గంగారాం, జుంగల పెద్ద గంగారాం, రేండ్ల రాజారెడ్డి, భూదేవి, సాయమ్మ, గంగాధర్, కిషన్, గున్నవ్వ, సంఘ కార్యదర్శి జక్కని శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.