నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని పెర్కిట్ బొర్రా గణపతి దేవాలయం నందు మంగళవారం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించినారు. పట్టణానికి చెందిన ఆనంద్ ప్రింటర్స్ వారి సౌజన్యంతో ఈ సంవత్సరం నూతన క్యాలెండర్ వీడిసి సభ్యులు అధ్యక్షులు దేవేందర్ క్యాషియర్ రాజబాబు సెక్రటరీ అశోక్ , దేవేందర్ గార్ల సమక్షంలో నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పది సంవత్సరముల నుండి ఆనంద్ గారు ఉచితంగా దాదాపుగా ఒక వెయ్యి క్యాలెండర్లను ప్రతి సంవత్సరం పంచడం జరుగుతుందని తెలిపారు. నూతన సంవత్సరం అందరికీ శుభం కలగాలని కోరారు. ఆనంద్ శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు దేవేందర్, క్యాషియర్ రాజబాబు ,సెక్రెటరీ అశోక్, పసుపుల రఘునాథ్, కుండుక గంగాధర్, దాస్, మట్ట వెంకటేష్ రఘుపతి గంగా మోహన్, కిషన్ ఆలయ పూజారి ప్రభాకర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.