బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 5వ తేదీ నుండి నిర్వహించే జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సంబంధించిన కరపత్రాలను మాజీ మంత్రి జోగు రామన్న విడుదల చేశారు. ఆదివారం శాంతినగర్ లోని రామన్న నివాసంలో బజారత్నుర్ మండల యూత్ అధ్యక్షులు చంద్రశేఖర్ తో కలిసి ఆవిష్కరించారు. పార్టీ ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహించడం అభినందనీయమని రామన్న అన్నారు. గ్రామీణ క్రీడాలను ప్రోత్సహించడం ద్వారా క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యం మెరుగుపడుతుంది అన్నారు. క్రీడాకారులకుజోగు ఫౌండేషన్ తరపున ప్రత్యేక ప్రోత్సహించడం జరుగుతుందని కొనియాడారు. కార్యక్రమంలో జనార్ధన్, ప్రభాకర్, సుకుమార్, మనివర్ధన్ పాల్గొన్నారు.