డీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ..

Inauguration of DTF calendar..నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరషన్ 2025 క్యాలెండర్ ను ఫెడరేషన్ నాయకులు ఆవిష్కరించారు. బుధవారం పట్టణంలోని కొమురం భీం చౌక్ లో నాయకులు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యవ్యవస్థలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. విద్యారంగానికి 30% బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీ టీఎఫ్ నాయకులు సుధాకర్, వృకోధర్, సాయికాంత్, శ్రీనివాస్, నారాయణ్, కిషోర్ ఉన్నారు.