
తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ 711 భూపాలపల్లి జిల్లా యూనియన్ సభ్యులు తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2024వ సంవత్సరపు క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ లెక్చరర్స్ సమస్యల పరిష్కారం దిశగా, కళాశాలల అభ్యున్నతికి తమ సంఘం పనిచేస్తుందని కళాశాల అధ్యాపకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుప్పటి ప్రవీణ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రవీందర్, జిల్లా మహిళా కార్యదర్శి స్వరూప రాణి, సభ్యులు నరేందర్, వెంకట్ రెడ్డి, కరుణాకర్ పాల్గొన్నారు.