నిజామాబాద్ ఏఆర్టిలో ఐఇసి మెటీరియల్ ఆవిష్కరణ 

నవతెలంగాణ కంఠేశ్వర్
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు లో భాగంగా తెలంగాణ సాక్స్ వారి ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏఆర్టి లో ఐఇసి మెటీరియల్ ను గురువారం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ దేవి నాగేశ్వరి, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, డాక్టర్ వివి రావు ఏఆర్టి నోడల్ ఆఫీసర్, ఏఆర్టి మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ ఇందూర్ ప్రవీణ్, డాక్టర్ చిట్మిల్లా సంతోష్ కుమార్, డిస్టిక్ ప్రోగ్రాం మేనేజర్ చెల్లా సుధాకర్, ఏఆర్టి  స్టాప్ తదితరులు పాల్గొన్నారు.