స్వదేశీ మైక్రో టర్బోజెట్‌ ఇంజిన్‌ ఆవిష్కరణ

Bussiness – రఘువంశీ మెషిన్‌ టూల్స్‌ వెల్లడి
హైదరాబాద్‌ : ఏరోస్పేస్‌, రక్షణ రంగ ఉత్పత్తుల కంపెనీ రఘు వంశీ మెషిన్‌ టూల్స్‌ కొత్తగా ‘ఇంద్రా ఆర్‌వి25:240ఎన్‌’ పేరుతో పూర్తిగా స్వదేశీ మైక్రో టర్బోజెట్‌ ఇంజిన్‌ను ఆవిష్కరించినట్టు వెల్లడించింది. దీని డిజైన్‌, అభివృద్ధికి ఐఐటీ హైదరాబాద్‌ మద్దతును ఇచ్చిందని పేర్కొంది. ఇది దేశీయ ఏరోస్పేస్‌ తయారీ, పర్యావరణ వ్యవస్థ వృద్ధికి దోహదం చేయనుందని.. కొత్త ఉద్యోగాలను సృష్టించనుందని తెలిపింది. ఆర్‌వీఎంటీ హైదరాబాద్‌ కేంద్రంలో ఇంజిన్‌ ప్రత్యక్ష పరీక్షను ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌, రక్షణ శాఖ మంత్రి మాజీ సైంటిఫిక్‌ అడ్వైజర్‌, డిఆర్‌డిఒ మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ జి సతీష్‌ రెడ్డి సమక్షంలో ఈ ప్రయోగం జరిగిందని తెలిపింది. అసెంబ్లీ, టెస్ట్‌ ల్యాబ్‌ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు.