కల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ – కంటేశ్వర్

తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్ ను కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యాలయం హమాల్వాడిలో బుధవారం విడుదల చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట్రాములు  జిల్లా అధ్యక్షులు శేపూరు సాయాగౌడ్, నాయకులు కోయడ నరసింహులు, శ్రీరామ్ గౌడ్, వినేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ..దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం 1944లో ఏర్పడి నేటికి 80 సంవత్సరాలు పూర్తీ చేసుకుంది. తెలంగాణలో కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడి 55 సంవత్సరాలు దాటింది. అనేక పోరాటాలు చేసి వృత్తి సంరక్షణ, గీత కార్మికుల సంక్షేమం కోసం నిర్విరామంగా పోరాడిన సంఘం  క్యాలెండరు ను ఈరోజు విడుదల చేశాం. అలాగే గత ప్రభుత్వం గీత కార్మికుల పైన సవతి తల్లి ప్రేమ చూపించింది. గీత కార్మికులకు మాయవార్ బంద్ చేస్తున్నం మీకేదో లాభం జరుగుతుంది అని గీత కార్మికులను మోసం చేశారు. దీంతో మనకు ప్రభుత్వపరంగా ఎలాంటి హక్కులు లేకుండా జరిగినాయి. ఇప్పటికైనా గీత కార్మికుల సంక్షేమానికి సమగ్రమైన చట్టాన్ని చేయాలి. కలుగీత ఉత్పత్తులను ప్రోత్సహించాలి, నందనం కలుగుగీత పరిశ్రమని పునరుద్ధరించి అభివృద్ధి పరచాలి, టిఎఫ్టి, టిటిసిఎస్ షాపులకు 560 జీవో ప్రకారం ఈతవనం, తాటి వనం పెంచుకోవడానికి 5 ఎకరాల భూమిని ఇవ్వాలి అని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కలుగత కార్మిక సంఘం నిజాంబాద్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది. వీటి సాధనకై భవిష్యత్తులో పోరాటానికి సిద్ధంగా సంఘం ఉన్నదని తెలిపారు.