కల్లుగీత కార్మిక సంఘం మండల నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆ సంఘం మండల అధ్యక్షుడు అనపురం రవి గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గీతా కార్మికుల సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. చెట్ల పెంపకానికి భూమి, కల్లు మార్కెట్, నీర ఉత్పత్తులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు సభ్యత్వం, గుర్తింపు కార్డులు, పెడింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మందపూరి సతీష్, అనపురం మల్లయ్య, అనపురం చంద్రమౌళి, బొమ్మెర వెంకన్న, అంజయ్య, మధార్, రాము, వెంకన్న, శంకరయ్య, రాము, కొండయ్య, రాజాలు తదితరులు పాల్గొన్నారు.