
జిల్లా కేంద్రంలో కురుమ యువ చైతన్య సమితి ( కేవైసీఎస్) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్’ను మాజీ మంత్రి షబ్బీర్ అలీ చేతుల మీదుగా జిల్లా అధ్యక్షులు మామిడి సంజీవ్ కురుమ అధ్యక్షతన ఆదివారం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించరు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ, టౌన్ యూత్ ప్రెసిడెంట్ గొడుగుల శ్రీనివాస్, కేవైసీఎస్ రాష్ట్ర నాయకులు చెలిమేటి గంగాధర్, కురుమ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల స్వామికురుమ, మాచారెడ్డి మండల అధ్యక్షులు కురుమ సంతోష్, భిక్కనూర్ మండల సలహాదారులు కడబోయిన సాగర్ కురుమ దోమకొండ కార్యదర్శి ముత్తి బుచ్చిరాజ్ కురుమ, మాచారెడ్డి మండల నాయకులు దర్ని ప్రేమ్ కుమార్ కురుమ, ముత్యంపేట్ గ్రామ అధ్యక్షులు మల్లేష్ కురుమ, భిక్కనూరు మండల నాయకులు తుప్పతి స్వామి కురుమ, టేక్రియాల్ కామల్ల మనోహర్ కురుమ, పెద్దమల్లారెడ్డి గ్రామ ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల మహిపాల్ కురుమ, కొమురయ్య కురుమ తదితరులు పాల్గొన్నారు.