నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రమోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్ఎంఎస్టీఎఫ్) ప్రచురించిన 2024 క్యాలెండర్ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆదివారంహైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో రాష్ట్రఅధ్యక్ష కార్యదర్శులు బి.కొండయ్య, డా.యస్.మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావారవి,కోశాధికారి లక్ష్మారెడ్డి, పి.క్రాంతి కుమార్,డా.రంజిత్, విజయేందర్,వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్స్ ఎడిటర్ మాణిక్ రెడ్డి, తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర కన్వీనర్ రాధే శ్యామ్ లు పాల్గొన్నారు.