సరికొత్త రూపంలో కబడ్డీ కబడ్డీ
హైదరాబాద్ : పాపులర్, గ్రామీణ క్రీడ కబడ్డీకి సరికొత్త వెర్షన్ ఆవిష్కితమైంది. డిఫెండర్లు, రెయిడర్లు సమాన స్థాయిలో వీలైనన్ని అత్యధిక పాయింట్లు సాధించేందుకు అనువుగా దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కుంభం రాంరెడ్డి మోడ్రన్ కబడ్డీ ఫార్మాట్‌ను రూపొందించారు. మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం దోమలగూడలో ఈ సరికొత్త ఫార్మాట్‌ను ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. రాజారావు, జగన్‌మోహన్ గౌడ్, మారపల్లి కుమార్, రవికుమార్, మధవీలత, శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.