నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ..

Inauguration of new year calendars..నవతెలంగాణ – ఆర్మూర్  

మండలంలోని   పిప్రి గ్రామములోని ఎల్-షడ్డాయి ప్రార్థన మందిరంలో నూతన సంవత్సర ప్రార్థనలు బుధవారం ఘనంగా జరిగాయి.  దైవ సేవకులు పాస్టర్ శేఖర్ ఇడ్విన్  మాట్లాడుతూ ఈ నూతనమైన సంవత్సరంలో అందరూ శాంతి సమాధానములతో ఆనందంతో ఉండాలని ప్రార్థన చేశారు.  అనంతరం నాటికలు డాన్సులతో  యవనస్తులు అలరించారు. ఈ ప్రాంతంలో భాగంగా పాస్టర్ శేఖర్ ఇడ్విన్ 2025వ సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు గోకచిన్ని పతాని సుమన్,చందు,నితిన్ తదితరులు పాల్గొన్నారు.