నాన్ టీచింగ్ వర్కర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ..

నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు భోజన మంద చేస్తున్నాం టీచింగ్ వర్కర్స్ వెట్టి చాకిరి చేయిస్తున్నారని, తగిన వేతనాన్ని కల్పించాలని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులకు ఆరోగ్యకరమైన వంటకాలు చేసి పెట్టినప్పటికీ పనికి తగిన వేతనాలు ఇవ్వడం లేదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు వేతనాలను లేబర్ యాక్ట్ ప్రకారం పెంచాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు ఏం సుజాత, ఉపాధ్యక్షురాలు మంజుల, కార్యదర్శి భారతి, సహాయ కార్యదర్శి లత, కోశాధికారి రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.