కరపత్రాల ఆవిష్కరణ 

నవతెలంగాణ కంఠేశ్వర్ : స్థానిక  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి  ఆధునిక చికిత్స పరికరాలు అలాగే నూతన విభాగాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు  వేముల ప్రశాంత్ రెడ్డి  కరములచే ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర బ్రాంచ్ ప్రతినిధులు డాక్టర్ విశాల్ ఆకుల రూపొందించిన మానసిక అవగాహన కరపత్రాలను మంత్రివర్యులు తన పర్యటనలో ఆసుపత్రి సైకియాట్రి విభాగంలో ఆవిష్కరణ నిర్వహింప చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ,తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్  ఆకుల లలిత, నిజామాబాద్ మేయర్  దండు నీతూ కిరణ్ , జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, డి ఏం అండ్ హెచ్ ఓ డాక్టర్ సుదర్శనం, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్  డాక్టర్ ఇందిరా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్  డాక్టర్ ప్రతిమరాజ్ సైకియాట్రి విభాగ డాక్టర్ రవి తేజ లు కూడా హాజరయ్యారు.