పంచాయతీ రాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ – భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం 2024 క్యాలెండర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి  ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో  పాల్గొన్న ఆలేరు జడ్పిటిసి  డాక్టర్ కుడుదుల నగేష్ , జిల్లా పరిషత్తు ముఖ్యకార్య నిర్వహణ అధికారి  సిహెచ్ కృష్ణారెడ్డి , ఉపముఖ్య కార్య నిర్వహణ అధికారి  బి శ్రీనివాసరావు ,  టిపిఆర్ ఎం ఈ ఏ రాష్ట్ర అధ్యక్షులు ఏపాల సత్యనారాయణ రెడ్డి , జిల్లా అధ్యక్షులు ఏ చంద్రమౌళి,  అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.