మండలంలోని కాటాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ ఆవరణలో లో పి ఆర్ టి యు ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పాయం మానేశ్వర్రావు ఆధ్వర్యంలో పి ఆర్ టి యు టి ఎస్ క్యాలెండర్-2025, ను లాంఛనంగా శనివారం ఆవిష్కరించారు. సందర్భంగా పి ఆర్ పి యు టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పాయం మానేశ్వరరావు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మండలాధికారులకు, విద్యార్థి విద్యార్థులకు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగాలని, క్రింది స్థాయి విద్యార్థులను అత్యున్నత స్థాయికి ఎదిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే విధంగా ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ కాటాపూర్ ప్రధానోపాధ్యాయులు బాణాల సుధాకర్, ఉపాధ్యాయులు సక్రు నాయక్, సమ్మయ్య, సామ్సన్, అక్బర్, జీవన్ లాల్, వెంకటేష్, పాపారావు, రాజేష్, జైపాల్ విజయ, శ్రీదేవి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.