టీపీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ – రాయపర్తి 
మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం  రాయపర్తి జెడ్పిహెచ్ఎస్ కాంప్లెక్స్ హెచ్ఎం గారె కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టిపిటీఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిపిటీఎఫ్ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తారని తెలిపారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించి ఉన్నత లక్ష్యాలు సాధించేవిధంగా కృషి చేస్తారు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో టిపిటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుముడవెల్లి వెంకటేశ్వర్లు, మండల శాఖ అధ్యక్షుడు బందుగు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ముదురుకోళ్ల సతీష్ కుమార్, మండల బాధ్యులు మచ్చ శ్రీనివాస్, సౌమిత్రి, కరుణ, సుధీర్, మురళి తదితరులు పాల్గొన్నారు.