టీపీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ..

నవతెలంగాణ- భువనగిరి
జిల్లా విద్యాశాఖ అధికారి  నారాయణ రెడ్డి టీపీటీఎఫ్ 2024 క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలోని టీపీటీఎఫ్ ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి బోధన  అందించి మన జిల్లా విద్యార్థులను రాష్ట్రస్థాయిలో ముందుండేలాగా ఎఫ్ఎల్ఎన్, ఉన్నతి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించాలని కోరినారు.  విద్యాబోధనలో వస్తున్నటువంటి నూతన బోధన అభ్యసన ప్రక్రియల పట్ల ఉపాధ్యాయులు సమగ్ర అవగాహన ఏర్పాటు చేసుకొని సమర్థవంతంగా తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియలు చేపట్టాలన్నారు. తద్వారా మెరుగైన భావిభారత సమాజాన్ని నిర్మించాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ మూసుకో వెంకట్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా   అధ్యక్షులు పరిపూర్ణాచారి ఉపాధ్యక్షులు బొక్క వెంకటరెడ్డి బయ్య లింగయ్య  కార్యదర్శిలు ఎన్ కృష్ణ భగవత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, కర్నాటి శేఖర్  పాల్గొన్నారు