తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టి పి టి ఎఫ్) ఆధ్వర్యంలో స్థానిక కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో సీఈవో యమ్. శ్రీనివాస్ గారు టి పి టి ఎఫ్ నూతన సంవత్సరం ( 2025) క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్య దర్శులు జంకె రాంచంద్రారెడ్డి, వేల్పుల బాలయ్యలు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో విద్యాభివృద్ధికి, కృషి చేయాలని తెలిపారు. అనంతరం జరిగిన జిల్లా సమావేశంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామచంద్ర రెడ్డి, బాలయ్యలు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, రాష్ట్ర కౌన్సిలర్ అర్కాల శ్రీనివాస్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క న్యాయమైన కోరికలను ప్రభుత్వం తక్షణమే అంగీకరించి వారి సమస్యలను పరిష్కరించి సమ్మెను ఆపేందుకు కృషి చేయాలని, పెండింగ్ లో ఉన్న నాలుగు డిఎ లను, వివిధ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని, రాష్ట్ర కౌన్సిలర్ కోట రామస్వామి మాట్లాడుతూ పి ఆర్ సి వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మర్రి అవినాష్, శ్రీధర్, ఎన్. రామస్వామి, జిల్లా కార్యదర్శులు ఎన్ .శ్రీనివాస్, జి.చంద్రమౌళి, లక్ష్మీరాజం,మాజీ రాష్ట్ర కార్యదర్శి గుంటి ఎల్లయ్య, మాజీ ప్రధాన కార్యదర్శి రాగల చంద్రశేఖర్, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు కోల రాజ రాజమల్లు పాల్గొన్నారు.