నవతెలంగాణ – ఆళ్ళపల్లి
తెలంగాణ రాష్ట్రం ఆదివాసీ టీచర్ ఫెడరేషన్ 2024 సంవత్సరం పురస్కరించుకుని నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక విద్యాశాఖాధికారి పి.కృష్ణయ్య చేతుల మీదుగా మండల కేంద్రంలోని ఎమ్మార్సీ ఆవరణలో ఈసాల రాంబాబు అధ్యక్షతన ఘనంగా జరిగిందని ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ సంఘం మండల నూతన అధ్యక్ష, కార్యదర్శులు ఈసం శ్రీనివాస్, కొమరం రాంబాబు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల ఆళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పీజీ హెచ్.ఎంగా వచ్చిన కె.శాంతరావును సంఘం తరుపున ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగిందని తెలిపారు. తదనంతరం ఏటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు ఉండం నాగేంద్రరావు, కుంజ కృష్ణ, జిల్లా అధ్యక్షులు పాయం ఆనందరావు, ప్రధాన కార్యదర్శి చాపల రమేష్ బాబు పర్యవేక్షణలో నూతన మండల ఎన్నిక జరిగిందన్నారు. అందులో భాగంగానే ఆళ్ళపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా యాప నర్సింహారావు, ప్రచార కార్యదర్శిగా కొడం రాంబాబు, కోశాధికారిగా గుంపెనపల్లి సత్యనారాయణ, మహిళా కార్యదర్శిగా ఊకే కోటేశ్వరమ్మలను ఎన్నుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు ఊకె కృష్ణ, పూనెం బాలరాజు, మోకాళ్ళ మోహనరావు, గుండాల బాధ్యులు బొల్లి అంజయ్య, కల్తి రామకృష్ణ, వాసం శ్రీరాములు, కొమరం పాపారావు, తదితరులు పాల్గొన్నారు.