టీఎస్ యుటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ -తాడ్వాయి : మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ ఇంద్రానగర్ పాఠశాలలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కేశవరావు చేతుల మీదుగా, టీఎస్ యుటిఎఫ్ మండలాధ్యక్షుడు పాపారావు ఆధ్వర్యంలో టీఎస్ యుటిఎఫ్ క్యాలెండర్ ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కారం కోసం పోరాటంలో ముందుంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెండింగ్లో ఉన్న మూడు కరువు భత్యం ప్రకటించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణమి శాతం పెరిగిందని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయుల బోధన చేయడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకులు చంద్రారెడ్డి రవీందర్ స్వామి రవికుమార్ పాయం కీర్తిమంతరావు రజిత రేణుక శాలిని తదితరులు పాల్గొన్నారు.