వీర వైశాలింగాయత్ క్యాలెండర్ ఆవిష్కరణ

– ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు బసవరాజ్ పటేల్
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ : మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన వీర శైవ లింగాయథ్ సమాజం మండల అధ్యక్షులు గ్రామం మాధవరావు దేశాయ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు బసరాజ్ పటేల్. మాట్లాడుతూగత మూడు రోజుల క్రితం లింగయత్ రాష్ట్ర పెద్దల సమక్షంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. లింగాయాథ్ సమాజం పట్ల జరుగుతున్న అన్యాయాలు, మనకున్న సమస్యలపట్ల ఐక్యతతో పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది, అందుకు మీ సహాయ సహకారాలు అవసరం. గత ఉమ్మడి రాష్ట్ర మాజీ  వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు లింగాయత్ లను బీసీలు గా గుర్తించారని అన్నారు. చాలా చోట్ల లింగాయత లకు ఇండ్లు లేవని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాధవరావుదేశాయ్,బసవరాజ్ దేశాయ్, ఈశ్వరప్ప దేశాయ్,విజయదేశాయ్, సంతోష్ దేశాయ్ మాధవరావు దేశాయ్, సంగమేశ్వర్ దేశాయ్, రాజు దేశాయ్, సురేకాంత్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.