విశ్వకర్మ నూతన క్యాలెండరు ఆవిష్కరణ

Boduppalనవతెలంగాణ – బోడుప్పల్
బోడుప్పల్ లోని టెలిఫోన్ కాలనీ లో విశ్వవిరాట్ సంఘం అధ్యక్షులు చలకుర్తి కనకచారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విశ్వకర్మలు రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని, ఏ రాజకీయ పార్టీలు మనకి తగిన గుర్తింపు ఇచ్చి తగు ప్రాతినిధ్యం కల్పించడం లేదని అయన తెలిపారు.  నేటి రాజకీయాలన్నీ ఓట్ల చుట్టు తిరుగుతన్నవి ఏకులoలో ఎక్కువ ఓట్లు ఉంటే ఆ కులం భజన చేస్తున్న రోజులు ఇవి.  మనం మారుదాం మన బలాన్ని  బలగాన్ని… పెంచుకుందామని అయన వివరించారు. మనం కలిసికట్టుగా ఉండటం తో పాటు రాజకీయా చైతన్యం కలిగి ఉండాలని ఈ సందర్బంగా అయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్యదర్శి పడకంటి నర్సింహాచారి కోశాధికారి మద్దోజు శ్రీనివాస్ చారి మిగిలిన సంఘ సభ్యులు పాల్గొన్నారు