నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, జలమండలి శాఖ మొదటి డైరీ ఆవిష్కరణ జరిగింది. ఖైర తాబాద్లోని ప్రధాన కార్యాలయంలో టీఎన్జీవో అధ్యక్షుడు మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీజీవో హైదర ాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ నూతన డైరీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మొదటి సారిగా టీఎన్జీవో జలమండలి శాఖ డైరీ తయారు చేయడం ఆనందంగా ఉందన్నారు. కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించాలన్నారు. ఈ సందర్భంగా బోర్డులో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన పలువురు ఉద్యోగుల్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీజీవో జలమండలి శాఖ జనరల్ సెక్రటరీ చంద్రజ్యోతి, జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ శేఖర్, జనరల్ సెక్రటరీ హరిశంకర్, టీఎన్జీవో జనరల్ సెక్రటరీ అజరు సింగ్, ట్రెజరర్ నవీన్, ప్రతినిధులు భరత్, తదితరులు పాల్గొన్నారు.