
యాదవ ఉద్యోగ సంఘం క్యాలెండర్ ను ఆదివారం దురాజ్ పల్లి లోని పెద్దగట్టు లింగమంతులస్వామి దేవాలయం లో ఆవిష్కరణ చేశారు. అనంతరం శ్రీకృష్ణ యాదవ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ యాదవులందరూ ఐక్యంగా ఉండి యాదవుల విద్యాభివృద్ధికి రాజకీయ అభివృద్ధికి సామాజిక అభివృద్ధికి అందరు కృషి చేయాలని కోరారు. పీసీసీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు తండు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ యాదవులు రాజకీయంగా ఎదగాలంటే ప్రతి ఊరిలో యాదవుల్ని సంఘటితపరిచి రాబోయే కాలంలో యాదవులు కూడా మంచి నాయకత్వం వహించాల్సిందిగా కోరారు. సూర్యాపేట జిల్లా యాదవ ఉద్యోగ సంఘ అధ్యక్షులు మట్టపల్లి రాము యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘం తరఫున యాదవలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తామని, ప్రతి యాదవ కుటుంబం విద్యలో విద్యావంతులై , రాజ్యాధికారంలో పాలుపంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో యాదవ ఉద్యోగ సంఘం జిల్లా కార్యదర్శి చెల్లా వెంకటేశ్వర్లు , యాదవ్ ఉద్యోగ సంఘం జిల్లా కోశాధికారి వీరబోయిన వెంకటేశ్వర్లు , మర్యాద సైదులు , విద్యావంతుల వేదిక అధ్యక్షులు వీరస్వామి , బీసీ విద్యార్థి సంఘం నాయకులు వీరబోయిన లింగయ్య , ముద్ద బిక్షపతి , చలపతిరావు , సత్యనారాయణ పిల్లై ,గొట్టేటి సైదులు , దొంగరి మహేష్, బత్తుల దశరథ , భయ్యా మల్లికార్జున , అల్లి నాగయ్య , నారబోయిన వెంకట్ , భయ్యా నారాయణ , మద్ది శ్రీనివాస్ , బోయిన లింగయ్య వీరబోయిన నాగయ్య ,మన్నే యాదగిరి ,దాసరి వెంకన్న ,వేల్పుల వెంకన్న , కొమ్మ శ్రీశైలం , బత్తుల రాజేశ్వరి , పుల్లయ్య , దేవలింగం , చిన్నబోయిన కృష్ణయ్య, ,వీరబోయిన నాగయ్య , జాల లింగరాజు ,కాల్సన్ సైదులు ,మట్టపల్లి దేవలింగ ,మేకల శ్రీనివాస్ ,ఏర్పుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు….