న్ఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్ డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి నిధుల మళ్లింపునకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై కార్పొరేట్ వ్యవహా రాల శాఖ విచారణ చేపట్టింది. నిధుల తరలింపునకు సంబంధించి ఒక్క థర్డ్ పార్టీ వెండర్‌తో హీరో మోటో కార్ప్‌కు ఉన్న సంబంధాలపై విచారణ జరగ నుందని సమాచారం. కాగా.. ఈ విచారణ అంశంపై తమకు ఎలాంటి సమాచారం లేదని హీరో మోటో పేర్కొంది. ఒకవేళ దర్యాప్తు సంస్థలు కోరితే తగిన సమాచారాన్ని అందిస్తామని ఆ కంపెనీ తెలిపింది. ఈ వార్తలతో గురువారం హీరో మోటో షేర్లు నష్టపోయాయి. బిఎస్‌ఇలో 2.99 శాతం నష్టంతో రూ.2,842.70 వద్ద ముగిసింది.