నవతెలంగాణ – తాడ్వాయి
అక్రమ ఇసుక తరలింపు పై విచారణ కొనసాగుతుందని తహసీల్దార్ గిరిబాబు ఒక్క ప్రకటనలో తెలిపారు . ఈ సందర్బంగా తహసీల్దార్ గిరిబాబు మాట్లాడుతూ ఇసుక తరలింపు విచారణ ఉత్తదే అని సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడం సరైనది కాదన్నారు. ఈ విషయంలో సీసీ కెమెరా ఫుటేజ్ వీడియోలు సేకరణ జరుగుతుందన్నారు అక్రమ ఇసుక తరలించే వాహనాలను సీజ్ చేయవలసిందిగా పోలీస్ వారిని కోరినట్లు తెలిపారు. వారు ఇంకా ఆ ఫుటేజ్ వీడియోలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుందని సమాచారం మేరకు వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ వారిని సమాచారం అడిగిన ఓసి ఆఫీస్ కాపీ ల సమయం పడుతుందన్నారు. అక్రమ ఇసుక పైన అక్రమంగా తవ్విన జెసిబికి జరిమానా విధించమన్నారు ఇంకా అక్రమంగా ఇసుక తరలించిన వాహనాలను సీసీ కెమెరాలు ద్వారా గుర్తించి వారి మీద తగు చర్యలు తీసుకుంటమని తహసీల్దార్ గిరిబాబు అన్నారు.