నకిలీ ఫేస్ బుక్ పై తక్షణమే విచారణ చేపట్టాలి

– కలెక్టర్ హరిచందన దాసరి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పేరుతో నకిలి ఫేస్ బుక్ ఖాతా ఓపెన్ చేయడమే కాకుండా, ఫ్రెండ్లీ రిక్వెస్ట్ పంపిస్తూ మెసెంజర్లు చాటింగ్ చేస్తున్నారని పేర్కొంటూ ఆయా దినపత్రికలలో ప్రచురితమైన వార్తకు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన స్పందించారు. ఈ విషయమై తక్షణమే విచారణ నిర్వహించి బాధ్యులైన వారిని గుర్తించాలని  జిల్లా పోలీసు  సూపరింటెండెంట్ చందనా దీప్తికి సూచించారు. తన పేరుపై నకిలీ ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేయడమే కాకుండా, ఫ్రెండ్లీ రిక్వెస్ట్ లను పంపిస్తూ చాటింగ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి పూర్తి వివరాలు తెలియజేయాలని, బాధ్యులను గుర్తించిన అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె  తెలిపారు.