నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలి

– కార్యవర్గంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి…
– పబ్లిక్ క్లబ్ సీనియర్ సభ్యులు
నవతెలంగాణ సూర్యాపేట: పబ్లిక్ క్లబ్ లో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై తక్షణమే ఆర్డివో విచారణ జరపాలని క్లబ్ సీనియర్ సభ్యులు, సీనియర్ న్యాయవాది నూకల సుదర్శన్ రెడ్డి, మాజీ కార్యదర్శి బొల్లెద్దు దశరథలు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక క్లబ్ ఆవరణలో జరిగిన సభ్యుల సమావేశంలో వారు మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పబ్లిక్ క్లబ్ సెక్రటరీగా కొప్పుల వేణారెడ్డి పనిచేసిన సమయంలో దుకాణ సముదాయం నిర్మాణం చేయడం వలన, జిమ్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం పెరిగిందని గుర్తు చేశారు. కాగా ప్రస్తుతం క్లబ్ ఆదాయం లక్షలలో వున్నదని కానీ ప్రస్తుత సెక్రటరీ క్లబ్ ఆదాయ, వ్యయాలను కమిటీ సభ్యులకు తెలియజేయడం లేదని వారు విమర్శించారు.
సెక్రటరీ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ, సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడినారని వారు ఆరోపించారు.12 నెలలకు ఒకసారి జనరల్ బాడి మీటింగ్ పెట్టవలసి వున్నప్పటికీ, సమావేశం నిర్వహించడం లేదన్నారు. పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ కు కాంట్రాక్టర్ రెండు సంవత్సరాల పాటు చెల్లించ వలసిన అద్దె చెల్లించ లేదని, అద్దె వసూలు చేస్తామని చెప్పిన కార్యదర్శి నేటికి వసూలు చేయలేదన్నారు. కావున క్లబ్ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలతో పాటు క్లబ్ చైర్మన్ పై ఆర్డివొ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పబ్లిక్ క్లబ్ సభ్యులు ఎల్గురి చంటి బాబు, శనగాని రాంబాబు గౌడ్,కుమ్మరికుంట్ల లింగయ్య, గవ్వా కేశవరెడ్డి, రావుల రాంబాబు నాయుడు, అంజద్ అలి, షేక్ సైదులు, రుద్రంగి రవి, నాగుల వాసు, రావుల రాంబాబు, యలగందుల సాయినేత, గుణగంటి సైదులు, కుందామల్ల శేఖర్, ఎల్గురి వెంకటేశం, రాపర్తి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.