నవతెలంగాణ – జుక్కల్
పాతకేసుల విచారణ సత్వరం చేపట్టి పెండింగ్ లేకుండా చేయాలని బిచ్కుంద సర్కిల్ ఇన్స్ పెక్టర్ నరేష్ అన్నారు. శనివారం నాడు మండలంలోని పోలీస్ స్టేషన్ ను ఆకస్మీకంగా రికార్ఢుల పరీశీలన చేసారు. ఈ సంధర్భంగా సీఐ నరేష్ మాట్లాడుతు పోలీస్ స్టేషన్ లో నిర్భయంగా వచ్చి ఫిర్యాదుల చేయాలని, ప్రెండ్లీ పోలీస్ లో భాగంగా ప్రజలకు ఇందుబాటులో ఉంటు శాంతీభద్రతలను కాపాడి విధులు నిర్వహించాలని అన్నారు. అసాంఘిక కాక్యకలాపాలు చేసే వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. మట్కా, పేకాట అడిన వారికి , అడించే నిర్వహకులకు చట్టంలోబడి చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు , సైబర్ నేరాలను అరికట్టించేందుకు స్మార్ట్ ఫోన్ లలో వచ్చె మేసేజ్ లకు స్పంగించి డౌన్ లోడ్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని పేర్కోన్నారు. రికార్డపలను పరీశీలించిన తరువాత పీఎస్ పరీసరాలను స్థానిక ఎస్సై సత్యనారాయణ తో కలిసి పరీశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేష్, ఎస్సై సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.