పెట్టుబడిదారుల ప్రయోజనాలే ప్రభుత్వాల లక్ష్యం..

– మిగులు భూములను పేదలకు ఎందుకు పంచరు ? : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజల ప్రయోజనాల కంటే పెట్టుబడిదారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్ల వ్యాపార ప్రయోజనాలే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు విమర్శించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ”పట్టణ స్థానిక సంస్థల సంస్కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజల ప్రయోజనాల కంటే పెట్టుబడిదారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్ల వ్యాపార ప్రయోజనాలే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులుకరణలు, కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాలపై” చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. నగర అభివృద్ధి, ప్రణాళికలు అన్నింటికీ ప్రజల అవసరాల కోసం కాకుండా ఎన్నికల అవసరాలను బట్టి నిధులు విడుదలవుతున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లోని సివరేజీ నిర్వహణ, మంచినీటి సరఫరా వ్యవస్థను ప్రయివేటు వ్యక్తులకు అప్పజెప్పే కుట్రలు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగాయని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. మిగులు భూములను పేదలకు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే పద్ధతుల్లో పట్టణ ప్రణాళికల్లో సంస్కరణలు, మున్సిపాల్టీల్లో ఆర్థిక సంస్కరణ అమలు చేసే నగరాలకే నిధులు ఇస్తామని ప్రకటించడం అప్రజాస్వామికమన్నారు. సీపీఐ(ఎం) సెంట్రల్‌ సిటీ కమిటీ సెక్రటరీ ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. నగరాల అభివృద్ధి కోసం సరైన పద్ధతుల్లో సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా నిధుల కేటాయింపులు జరగాలన్నారు. అర్బన్‌ పాలసీ విశ్లేషకులు డాక్టర్‌ డి.నరసింహారెడ్డి నగరాభివృద్ధి ప్రణాళికలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.దశరథ్‌, మహేందర్‌, శ్రీనివాసరావు, నగర కమిటీ సభ్యులు మారన్న, జి.నరేష్‌, నాయకులు శ్రీరాములు, అజరు బాబు, డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఎండీ జావిద్‌ తదితరులు పాల్గొన్నారు.