నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూర్ లో గల తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. పాఠశాలలో ఆరో తరగతికి 38 సీట్లు ఏడో తరగతికి 42 సీట్లు 8వ తరగతికి 16 సీట్లు 9వ తరగతికి 31 సీట్లు 10వ తరగతికి 29 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ తరగతులతో పాటు కళాశాలలో మొదటి సంవత్సరం చదువుల కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి, సి ఈ సి, కోర్సులలో ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ కళాశాలలో ప్రవేశాల కోసం విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.